ఏకంగా మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. క్రేజ్‌ మామూలుగా లేదుగా! | HanuMan Tamil, Malayalam, Kannada Versions To Stream On This OTT Platform - Sakshi
Sakshi News home page

Hanu Man Movie: మూడు ఓటీటీల్లోకి హనుమాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Mar 26 2024 3:54 PM | Updated on Mar 26 2024 4:14 PM

Hanu Man Movie Streaming On South Languages On This Ott - Sakshi

ప్రశాంత్ వర్మ  తెరకెక్కించిన హనుమాన్ బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. సంక్రాంతి సినిమాలతో పోటీపడి సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం హనుమాన్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు రెండు నెలల తర్వాత ఓటీటీ ప్రియులకు అందుబాటులోకి వచ్చిన హనుమాన్‌ పలు రికార్డులు కొల్లగొట్టింది. 

స్ట్రీమింగ్‌ అయిన కొద్ది గంటల్లోనే అత్యధిక వ్యూయర్‌షిప్‌ సాధించింది. ప్రస్తుతం జీ5లో తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతుండగా.. హిందీ వర్షన్ జియో సినిమాలో అందుబాటులో ఉంది. అయితే దక్షిణాది భాషల్లోనూ హనుమాన్ చిత్రాన్ని తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ వర్మ అప్‌డేట్‌ ఇచ్చారు. తమిళ, కన్నడ, మలయాళంలోనూ హనుమాన్ తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

ఈ మూడు భాషల్లోని సినీ ప్రియులకు ఏప్రిల్ 5 నుంచి అందుబాటులోకి రానుందని ట్వీట్ చేశారు. అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు.  ఈ లెక్కన హనుమాన్ ఏకంగా మూడు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది అన్నమాట.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement