Pushpa Pre Release: Fans Injured In Event, Rashmika Mandanna Apologize - Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: ‘పుష్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘటనపై రష్మిక ఆవేదన

Dec 13 2021 2:40 PM | Updated on Dec 13 2021 2:59 PM

Fans Injured In Pushpa Pre Release Event Rashmika Expressed Felt Bad - Sakshi

‘పుష్ప’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ఘటనపై రష్మిక స్పందించింది. ఆదివారం సాయంత్రం యూసఫ్‌ గూడలో ‘పుష్ప’ ప్రీరిలీజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈవెంట్‌కు అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ వేల సంఖ్యలో పోటెత్తారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరగడంతో కొందరు అభిమానులు  గాయపడ్డారు. ఈ విషయం తెలిసి రష్మిక ఆవేదన వ్యక్తం చేసింది.  

చదవండి: ‘పుష్ప’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌పై పోలీసులు ఫైర్‌, కేసు నమోదు

ట్విట్టర్ ద్వారా ఆమె స్పందిస్తూ.. 'ఈవెంట్ కు హాజరైన అందరికీ ధన్యవాదాలు. మీలో కొందరు గాయపడ్డారని విన్నాను. చాలా బాధేసింది. మీరంతా బాగున్నారని, కేర్ తీసుకుంటున్నారని భావిస్తున్నా' అని వ్యాఖ్యానించింది. మరోవైపు 'పుష్ప' ఈవెంట్‌లో రష్మిక మాట్లాడుతూ... ఈ సినిమా కోసం అందరం ఎంతో కష్టపడ్డామని తెలిపింది. ఈ చిత్రంలో కొత్త ప్రపంచాన్నే సృష్టించామని... 'పుష్ప' అందరినీ అలరిస్తుందని చెప్పింది. ఈ సినిమా కోసం చాలా రోజులుగా తన తల్లిదండ్రులకు దూరంగా ఉన్నానని తెలిపింది.

చదవండి: Bigg Boss 5 Telugu: కాజల్‌పై బిగ్‌బాస్‌ నిర్వాహకులు ఫైర్‌! ఆ రూల్‌ బ్రేక్‌ చేసిందా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement