Drishyam 2 Movie: దృశ్యం 2 మూవీ బంపర్ ఆఫర్.. సగం ధరకే సినిమా చూసేయండి..!

అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం దృశ్యం- 2. మలయాళంలో సూపర్ హిట్ సినిమా దృశ్యానికి సీక్వెల్‌గా వస్తోంది. హిందీలో దృశ్యం- 2 విడుదలకు సిద్దమైంది. అయితే తాజాగా ప్రేక్షకుల కోసం సరికొత్త బంపర్ ఆఫర్ ప్రకటించింది చిత్రబృందం. సినిమా రీలీజ్ రోజున అడ‍్వాన్స్ బుకింగ్ టికెట్లపై 50 శాతం భారీ తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 2 తేదీన బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ ఆఫర్ అభిమానులకు అందించేందుకు బహుళస్థాయి సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు చిత్రబృందం వివరించింది.
అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 18న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో టబు, ఇషితా దత్తా, అక్షయ్ ఖన్నా, రజత్ కపూర్, శ్రియా శరణ్ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇదే పేరుతో 2021లో వచ్చిన మోహన్ లాల్ మలయాళ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది ఈ సినిమా. 2015లో విడుదలైన దృశ్యం సూపర్ హిట్‌గా నిలిచింది.
Vijay Salgaonkar and family are back to continue the narrative of 2nd October!
Advance bookings open on 2nd October and you can block your tickets on the PVR app for JUST Rs. 50 and get 50% OFF on first day shows of Drishyam 2. #Drishyam2 in cinemas on 18th November, 2022. pic.twitter.com/EIEIV1ijvG
— P V R C i n e m a s (@_PVRCinemas) October 1, 2022
మరిన్ని వార్తలు