'Dhostan' Telugu Movie Release Date Officially Announced - Sakshi
Sakshi News home page

Dosthan Movie: డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'దోస్తాన్' 

Nov 28 2022 5:20 PM | Updated on Nov 28 2022 5:53 PM

Dosthan Movie Ready To Release On December Second - Sakshi

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లభి నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'దోస్తాన్'. సూర్య నారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ త్వరలోనే నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. 

చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ మాట్లాడుతూ.. 'సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా. అన్ని వర్గాల  వారికి  నచ్చే విధంగా  తెరకెక్కించాం. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్, లవ్, ఫ్రెండ్‌షిప్ మూడు జోనర్స్ కలిసిన మూవీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంతకుముందు హరీష్ రావు విడుదల చేసిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.  "దోస్తాన్" సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement