Dimple Hayathi Whole Family Tested Positive For COVID-19, Her Grandfather In ICU - Sakshi
Sakshi News home page

Dimple Hayathi: హీరోయిన్‌ ఇంట్లో పది మందికి కరోనా

May 20 2021 11:55 AM | Updated on May 20 2021 12:25 PM

Dimple Hayathi Whole Family Tested Positive For COVID19 - Sakshi

మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది..

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ఎంతోమంది సెలబ్రిటీలను పొట్టన పెట్టుకుంటూ, వారి ఆత్మీయులను దూరం చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందీ రక్కసి. తాజాగా ఈ మహమ్మారి హీరోయిన్‌ డింపుల్‌ హయాతి ఇంట్లో తిష్ట వేసింది. ఆమె కుటుంబంలో ఏకంగా పదిమందికి సోకిందట. దీంతో ఆమె తన కుటుంబ సభ్యుల గురించి ఆందోళన చెందుతోంది. కోవిడ్‌ బారిన పడిన తన తాతయ్య ప్రస్తుతం చెన్నైలోని ఐసీయూలో పోరాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

'మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో 10 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నిస్తున్నాం. గత వారం రోజులుగా శారీరకంగా, మానసికంగా ఇది చాలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది' అని హయాతి పేర్కొంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఉంది. ఇటు తెలంగాణ, అటు తమిళనాడులో లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో ఇక్కడే ఇరుక్కుపోయిన హయాతి తన కుటుంబ సభ్యుల వెంట లేనందుకు బాధపడుతోంది. కాగా 'గద్దలకొండ గణేష్‌' చిత్రంలో వరుణ్‌ తేజ్‌ సరసన నటించిన డింపుల్‌ హయాతి ప్రస్తుతం రవితేజతో 'ఖిలాడీ' సినిమా చేస్తోంది. మరోవైపు ఓ తమిళ చిత్రంలో హీరో విశాల్‌తో జోడీ కడుతోంది.

చదవండి: హాలీవుడ్‌ డెబ్యూలో జాక్వెలిన్‌..షూటింగ్‌ ఎక్కడ జరిగిందంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement