Balagam: సర్పంచ్‌ క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టం

Cultural traditions of Telangana - Sakshi

తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలు, మానవ సంబంధాలు..అనుబంధాలు వెండితెరపై అద్భుతంగా ఆవిష్కృతమైన ‘బలగం’ సినిమాలో ఉమ్మడి మెదక్‌ జిల్లాకు చెందిన పలువురు నటించారు. కొమురయ్య అల్లుడు నారాయణ పాత్రలో రామాయంపేటకు చెందిన ఐరేనిమురళీధర్‌గౌడ్,  సర్పంచ్‌ పాత్రలో హత్నూరకు చెందిన వాసుదేవరావు, రైతు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా హుస్నాబాద్‌కు చెందిన రవితేజ మెప్పించారు. 

కొమురయ్య అల్లుడిగా.. 
కొమురయ్య అల్లుడి పాత్రలో నటించిన మురళీధర్‌గౌడ్‌ విద్యాభ్యాసమంతా సిద్దిపేట జిల్లాలోనే. ఏడో తరగతి వరకు సిద్దిపేటలో, 8 నుంచి 11వ తరగతి వరకు గజ్వేల్‌లో విద్యనభ్యసించాడు. పీయూసీ, డిగ్రీ 1974 సంవత్సరంలో సిద్దిపేటలో పూర్తి చేశాడు. పదేళ్ల పాటు రామాయంపేటలో వ్యాపారం కూడా చేశారు. 1984లో విద్యుత్‌శాఖలో ఎల్‌డీసీ పోస్టింగ్‌ తీసుకొని వనపర్తిలో పనిచేశాడు. 2002లో హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. తర్వాత హైదరాబాద్‌లోని విద్యుత్‌శాఖ కార్పొరేట్‌ కార్యాలయంలో జేఏఓగా 2012 జనవరిలో ఉద్యోగ విరమణ పొందారు. మురళీధర్‌కు చిన్ననాటి నుంచే నాటకాలకంటే మక్కువ. ఉద్యోగ విరమణ తర్వాత పూర్తిస్థాయి సమయం దొరకడంతో సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2017 నాటికి సినిమా ట్రాక్‌లోకి వచ్చాడు. పెళ్లిచూపులు సినిమా డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ “పిట్టకథలు’ వెబ్‌ సిరీస్‌లో మొదటగా మురళీధర్‌కు నటించే అవకాశం లభించింది. ఆ తర్వాత డీజే టిల్లు సినిమాలో హీరో తండ్రిగా రోల్‌లో కనిపించాడు. దీంతో క్రమక్రమంగా సినిమా అవకాశాలు పెరిగాయి. ఆ తర్వాత బలగం సినిమాలో కొమురయ్య అల్లుడి పాత్రకు అవకాశం వచి్చంది. సినిమాలో నారాయణ పాత్ర మెయిన్‌రోల్‌లో ఒకటి కావడం, అద్భుతంగా నటించడంతో ఆయనకు సినిమా ఆఫర్లు పెరిగాయి. మంగళవారం, స్క్వేర్, భగత్‌సింగ్‌ సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోనే నివాసముంటున్నాడు. బంధువులు, స్నేహితులు సిద్దిపేట, మెదక్‌లో ఉన్నారు. అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి వెళుతూ ఉంటాడు. తరుణ్‌భాస్కర్‌ వలనే బలగం సినిమాలో అవకాశం లభించిందని, నాకు మంచి గుర్తింపు వచి్చందని మురళీధర్‌ సంతోషం వ్యక్తం చేశారు. 

రైతుగా రవితేజ
బలగం సినిమాలో రైతుగా నటించిన రవితేజ స్వస్థలం హుస్నాబాద్‌. ఇంటర్‌ వరకు హుస్నాబాద్, సిద్దిపేటలో డిగ్రీ పూర్తి చేశాడు. రవితేజకు కూడా చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి ఉంది. 2004లో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఆపై కరీంనగర్‌పై ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. 2019 నుంచి నిర్మాత దిల్‌ రాజు వద్ద ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ పనిచేస్తున్నాడు. మంత్రా –2 సినిమాకు  కోప్రొడ్యూసర్‌గా చేశాడు. తొలిసారిగా బలగం సినిమాలో హీరో పొలం పక్కన రైతుగా నటించారు. హీరో తండ్రికి, ఆ రైతుకు ఒకమారు గొడవ జరిగే సన్నివేశంలో నటించాడు. ప్రస్తుతం మా టీవీలో వస్తున్న మధురానగరి సీరియల్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బలగం సినిమాకు కూడా ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా కొనసాగాడు. నాకు టరి్నంగ్‌ పాయింట్‌ బలగం సినిమానే అని రవితేజ చెప్పారు. 

సర్పంచ్‌గా వాసుదేవరావు
బలగం సినిమాలో సర్పంచ్‌ పాత్రలో కనిపించిన వాసుదేవరావుది హత్నూర మండల పరిధిలోని దౌల్తాబాద్‌ స్వస్థలం. పదోతరగతి వరకు దౌల్తాబాద్‌లో, ఇంటర్‌ నర్సాపూర్‌లో చదివాడు.1992లో సినిమా డి్రస్టిబ్యూటర్‌ రంగ ప్రవేశం చేశాడు. నైజాం ఏరియా పరిధిలో పదుల సంఖ్యలో సినిమాలు విడుదల చేశారు. బలగం సినిమా డైరెక్టర్‌ వేణు ప్రోత్సాహంతో తొలిసారిగా వెండితెరపై కనిపించి సర్పంచ్‌ పాత్ర పోషించారు. హైదరాబాద్‌లో ఉంటూ సినిమా డి్రస్టిబ్యూటర్‌గా కొనసాగుతున్నా, నటనపై ఆసక్తి ఉందని చెబుతున్నాడు. ఆయన బంధువులు దౌల్తాబాద్‌లో ఉంటున్నారు. అద్భుతమైన సినిమాలో సర్పంచ్‌ క్యారెక్టర్‌ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అని వాసుదేవరావు చెప్పారు. 

పాత రోజుల్లోకి... 
కొన్ని దశాబ్దాల కిందటి వరకూ గ్రామం మధ్యలో లేదా రచ్చబండ వద్ద ప్రొజెక్టర్‌తో సినిమాలు వేసేవారు. రాత్రివేళ ఆ గ్రామ ప్రజలంతా అక్కడకు చేరి సినిమాలు చూసేవారు. బలగం సినిమాకు ప్రస్తుతం ఆ ట్రెండ్‌ కనిపి స్తోంది. పలు గ్రామాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌తో ఈ సినిమా ప్రదర్శిస్తున్నారు. కోహెడ మండలం బస్వాపూర్, నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది, చిన్నకోడూరు మండలం రామంచలో బలగం సినిమాను ప్రదర్శించారు.  
దుబ్బాక  పరిధిలోని లచ్చపేటలో శనివారం రాత్రి బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్‌ నంద్యాల శ్రీజ శ్రీకాంత్, దుబ్బాక సీఐ మున్నూరు కృష్ణ, దుబ్బాక సీఐ బత్తుల మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top