Ram Charan Emotional Post About Chiranjeevi In Acharya Movie Sets - Sakshi
Sakshi News home page

నాన్నతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా: చరణ్‌ ఎమోషనల్‌

Mar 1 2021 4:47 PM | Updated on Mar 1 2021 7:40 PM

A Comrade Moment: Ram Charan Post With Chiranjeevi In Acharya Sets - Sakshi

‘కామ్రేడ్‌ మూమెంట్‌.. ఆచార్య సెట్‌లో నాన్న, కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’

మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ నటిస్తోంది. ఈ చిత్రాన్ని మే 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించగా అభిమానులు వేయి కళ్లతో ఎదురు చేస్తున్నారు.  ఇక ఆచార్యలో చిరంజీవితోపాటు ఆయన తనయుడు, మెగాపవర్‌ స్టార్‌ రామ్ చరణ్ కూడా నటించనున్న విషయం తెలిసిందే. సిద్ధ అనే పాత్రలో చరణ్‌ కనిపించనున్నాడు. ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుపుకొంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది. అక్కడే చిరు, చరణ్‌పై వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనికోసం భారీగానే టీం కూడా అక్కడికి వెళ్లింది.

తాజాగా రామ్‌ చరణ్‌ తన ట్విటర్‌లో షూటింగ్‌కు సంబంధించిన ఓ ఫోటోను షేర్‌ చేశాడు. ఇందులోచరణ్‌ ముందు వైపుకి తిరిగి ఉండగా వెనక నుంచి తన భుజంపై చిరంజీవి చేయి వేసినట్లు కనిపిస్తోంది. చేతికి ఎర్ర రంగు వస్త్రం చుట్టుకొని కనిపిస్తున్న ఈ ఫోటోను పోస్టు చేస్తూ.. తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉందని అంటున్నాడు. ‘కామ్రేడ్‌ మూమెంట్‌.. ఆచార్య సెట్‌లో నాన్న, కొరటాల శివ గారితో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను’. అని చరణ్‌ ఎమోషనల్‌ అయ్యాడు. ఇదే ఫోటోను కొరటాల శివ షేర్‌ చేస్తూ.. ఆచార్య 'సిద్ధ'మవుతున్నాడని పేర్కొన్నాడు. కాగా మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది. మరి సినిమాలో వీళ్లిద్దరి కాంబినేషన్‌ ఎలా ఉంటుందో తెలియాలంటే మే 13 వరకు వేచి ఉండాల్సిందే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement