దేవుళ్లు కూడా నన్ను ఆపలేరు.. విజువల్ వండర్‌లా కొత్త ట్రైలర్ | Christopher Nolan The Odyssey Movie Trailer | Sakshi
Sakshi News home page

The Odyssey Trailer: క్రిస్టోఫర్ నోలన్ 'ద ఒడిస్సీ' తెలుగు ట్రైలర్

May 5 2026 4:09 PM | Updated on May 5 2026 4:09 PM

Christopher Nolan The Odyssey Movie Trailer

క్రిస్టోఫర్ నోలన్ పేరు చెబితే మూవీ లవర్స్ ఎగ్జైట్ అయిపోతారు. ఎందుకంటే ఈ దర్శకుడు తీసే సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక పట్టానా అర్థం కావనే కామెంట్స్ వినిపిస్తాయి గానీ సూపర్ హిట్ అవడంతో పాటు వేల కోట్ల కలెక్షన్స్ గ్యారంటీ.  ఈయన చేసిన లేటెస్ట్ మూవీ 'ద ఒడిస్సీ'. జూలై 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే తాజాగా తెలుగు ట్రైలర్ కొత్తది రిలీజ్ చేశారు. ఇది విజువల్ వండర్‌లా ఉంటూ మూవీపై హైప్ పెంచుతోంది.

(ఇదీ చదవండి: విజయ్ విక్టరీ.. కరుణానిధి కలలో కూడా ఊహించి ఉండరు!)

ఒడియన్ అనే రాజు జీవితం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో ఒడియన్ పాత్రలో మ్యాట్ డామన్, పెనెలోపీగా అన్నా హాత్వే, టెలిమాకస్‌గా టామ్ హోలండ్ కనిపించనున్నారు. రాబర్ట్ ప్యాటిన్‌సన్, ఛార్లెజ్ థెరోన్ కూడా కీలక పాత్రలు చేశారు. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ ఈ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాలతో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం విశేషం.

ట్రైలర్‌ బట్టి చూస్తే ఒడియన్ అనే రాజు, ఓ యుద్ధంలో పాల్గొనేందుకు తన రాజ్యాన్ని, భార్య కొడుకుని వదిలి మరో చోటకు వెళ్తాడు. యుద్ధం గెలిచి తిరిగొస్తుంటే సముద్రంలో ఇతడి సైన్యం ప్రయాణిస్తున్న ఓడ ప్రమాదానికి గురవుతుంది. కానీ ఒడియన్ రాజు ప్రాణాలు దక్కించుకుంటాడు. తర్వాత ఏమైంది? భార్య-కొడుకుని కలిశాడా అనేది మిగతా స్టోరీ. ప్రాచీన కవి హోమర్ రాసిన 'ద ఒడిస్సీ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. 

(ఇదీ చదవండి: ‘జన నాయగన్‌’.. నాడు శాపం నేడు వరం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement