Chiranjeevi Special Tour: హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్‌ కామెంట్‌, ఫోటో వైరల్‌

Chiranjeevi To Enjoy USA And Europe Vacation With His Wife Surekha - Sakshi

వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్‌  తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్‌ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్‌ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్‌ అమ్మ అండ్‌ డాడీ, ఐలవ్‌ యూ సో మచ్‌’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్త‌య్య‌, మామ‌య్య’ అని ఉపాసన కామెంట్‌ చేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top