BiggBoss Telugu 4: Akhil Shares MOst Toughest Moments In His Life | Akhil Breakup Story | నాన్న‌కు గుండెపోటు, నా ల‌వ్ బ్రేక‌ప్ ఒకేసారి - Sakshi
Sakshi News home page

'నాన్న‌కు గుండెపోటు, నా ల‌వ్ బ్రేక‌ప్ ఒకేసారి'

Oct 16 2020 4:37 PM | Updated on Oct 16 2020 6:08 PM

Bigg Boss Telugu 4: Akhil Sarthak Shares Toughest Moments In His Life - Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లోకి వ‌చ్చేవ‌ర‌కు కూడా అఖిల్ సార్థ‌క్ పేరు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ ఎప్పుడూతే మోనాల్‌తో క్లోజ్‌గా మూవ్ అయ్యాడో అప్ప‌టి నుంచి కెమెరాల‌న్నీ ఆ ఇద్ద‌రిపైనే ఫోక‌స్ పెట్టాయి. మ‌ధ్య‌లో అభిజిత్ కూడా మోనాల్‌తో ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఇది ట్ర‌యాంగిల్ స్టోరీగా మారిపోయింది. కానీ మోనాల్ మాయ అర్థం చేసుకున్న అభి ఆమెను దూరం పెట్టాడు కానీ అఖిల్ మాత్రం ఆమె మ‌త్తులో నిండా మునుగుతున్నాడే త‌ప్ప అందులో నుంచి బ‌య‌ట‌కు రాలేక‌పోతున్నాడు. అస‌లు బిగ్‌బాస్ హౌస్‌లో కూడా మోనాల్ లేక‌పోతే వేరే జీవిత‌మే లేద‌న్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తిస్తూ అస‌లు ఆట నుంచి సైడ్ అయిపోతున్నాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నాకు ఎవ‌రూ లేరు.. అఖిల్)

అఖిల్‌ను కుక్క‌తో పోల్చిన అత‌ని ప్రేయ‌సి
కాగా అఖిల్ ప్రేమ‌లో ప‌డ‌టం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలో అత‌డు ఓ హీరోయిన్‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగాడ‌ని ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ గంగవ్వ చెప్పుకొచ్చింది. ఆమెను నాలుగేళ్లు ప్రేమించాడ‌ని, ఇద్ద‌రూ క‌లిసి షికార్లు కూడా చేశార‌ట‌. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఓ రోజు ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్తే కుక్క‌ని వంక పెట్టి తిట్టింద‌ట‌. ఈ కుక్క‌ను ఎన్నిసార్లు వ‌ద్ద‌న్నా త‌ననే చూస్తోంద‌ని అంద‌ట‌. దీంతో ఆ క్ష‌ణ‌మే ఆమెకు దూర‌మయ్యాడ‌ని అవ్వ తెలిపింది. (చ‌ద‌వండి: బిట్టూ అని వాళ్లే పిల‌వ‌మ‌న్నారు: సుజాత‌)

నాన్న ఆటో డ్రైవ‌ర్‌, అమ్మ టైపిస్ట్‌
త‌న‌కు బ్రేక‌ప్ స్టోరీ ఉంద‌న్న విష‌యాన్ని అఖిల్ బిగ్‌బాస్ షోలో స్వ‌యంగా వెల్ల‌డించా‌డు. కాక‌పోతే అందుకు సంబంధించిన క్లిప్పింగ్‌ను అన్‌సీన్ వీడియోలో చూపించారు. "అమ్మానాన్న ప్రేమ పెళ్లి చేసుకున్నారు. త‌ర్వాత చాలా క‌ష్టాలు అనుభ‌వించారు. నాన్న ఆటో న‌డిపితే అమ్మ 300 రూపాయ‌ల‌కు టైపిస్ట్‌గా ప‌ని చేసేది. మూడేళ్ల క్రితం నా జీవితంలో దారుణ ప‌రిస్థితి ఎదుర్కొన్నాను. ఒకేసారి అన్ని స‌మ‌స్య‌లు మీద వ‌చ్చిప‌డ్డాయి. నాన్న‌కు గుండెపోటు వ‌చ్చింది. నా ల‌వ్ బ్రేక‌ప్ అయింది, కెరీర్ ఆగిపోయింది.  ఈ మూడు ఒకేసారి కావ‌డంతో త‌ట్టుకోలేక‌పోయాను. నాన్న‌ను అమ్మే చూసుకుంటోంది. మీ క‌డుపున పుట్టినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా"న‌ని అఖిల్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

   
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement