‘బిగ్‌బాస్‌’లోకి ‘ఆర్‌ఎక్స్‌100’ బ్యూటీ.. గ్లామర్‌ డోస్‌ పెరిగినట్లే! | Bigg Boss 5 Telugu: Payal Rajput To Enter Bigg Boss House Rumors Goes Viral | Sakshi
Sakshi News home page

Payal Rajput: ‘బిగ్‌బాస్‌’లోకి పాయల్‌.. గ్లామర్‌ డోస్‌ పెరిగినట్లే!

Jun 6 2021 8:47 PM | Updated on Sep 1 2021 8:09 PM

Bigg Boss 5 Telugu: Payal Rajput To Enter Bigg Boss House Rumors Goes Viral - Sakshi

బిగ్ బాస్ సీజన్ 4 లో అతిథిగా మెరుపులు మెరిపించింది ఈ హాట్‌ బ్యూటీ. తన డ్యాన్స్ షోతో అందరినీ మంత్రముగ్దులను చేసింది.

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై రెండో వారంలో  ఈ షోని ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్లాన్‌ చేస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే ఐదో సీజన్‌లో పాల్గొన‌బోయే కంటెస్టెంట్స్‌ను జూమ్ ద్వారా ఇంట‌ర్వ్యూలు కూడా పూర్తి చేశారట. వారం ప‌దిరోజుల్లో ఫైన‌ల్ కంటెస్టెంట్స్‌ను ఖ‌రారు చేసి, వారిని క్వారంటైన్‌లో ఉంచి త‌ర్వాత సీజ‌న్‌ను స్టార్ట్ చేస్తార‌ట‌.

ఇక ప్రతి సీజన్‌లో కనీసం ఒక్క హీరోయిన్‌ని అయినా తీసుకురావడం బిగ్‌బాస్‌ షో అనవాయితీగా మారింది. ఐదో సీజన్‌లో కూడా ఆ ఆనవాయితీని కొనసాగించబోతున్నారట. ఈ సారి ఆ అవకాశం ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ దక్కినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం మేరకు.. ఐదో సీజన్‌కి కంటెస్టెంట్‌గా రావాలని పాయల్‌ని కోరారట నిర్వాహకులు. పారితోషికం కూడా భారీగా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట. దీనికి పాయల్‌ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి తెలుగు బిగ్‌బాస్‌తో పాయల్‌కి మంచి అనుబంధం ఉంది.  బిగ్ బాస్ సీజన్ 4 లో అతిథిగా మెరుపులు మెరిపించింది ఈ హాట్‌ బ్యూటీ. తన డ్యాన్స్ షోతో అందరినీ మంత్రముగ్దులను చేసింది. అందుకే ఇప్పుడు ఏకంగా సీజన్ మొత్తానికి తాను కావాలని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తున్నారట. ఒకవేళ పాయల్‌ గనుక బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తే.. గ్లామర్‌కి కొదవే ఉండదని చెప్పొచు​. 



ఈ  సీజన్‌లో పాయల్‌తో పాటు యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, యాంకర్ వర్షిణి, కమెడియన్‌ ప్రవీణ్‌, యాంకర్ శివ, శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సింగర్‌ మంగ్లీ, న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా పాల్గొనబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే కొద్ది రోజుల వరకు వేచి చూడాల్సిందే.
చదవండి:
బిగ్‌బాస్‌ 5 : ముహూర్తం ఫిక్స్‌, షణ్ముఖ్‌, దుర్గారావు సహా కంటెస్టెంట్లు వీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement