బిగ్‌బాస్‌ ఎంట్రీపై పాయల్‌ క్లారిటీ, ఫ్యాన్స్‌ హ్యాపీ!

Bigg Boss 5 Telugu: Payal Rajput Gives Clarity On Rumours - Sakshi

ఒక్కసారైనా బిగ్‌బాస్‌ షోలో పాల్గొనాలని కొందరు సెలబ్రిటీలు కలలు కంటుంటారు. అయితే వీరికి భిన్నంగా మరికొందరు మాత్రం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లేదే లేదని తెగేసి చెప్తుంటారు. దీనికి ప్రత్యేక కారణమంటూ ఏమీ లేదు. బిగ్‌బాస్‌ హౌస్‌కు వెళ్లిన చాలామంది ఇమేజ్‌ డ్యామేజ్‌ అయితే, కొందరు కంటెస్టెంట్లు మాత్రం షో ద్వారా వచ్చిన పాపులారిటీతో తమ కెరీర్‌కు పూలబాటను నిర్మించుకున్నారు. 

ఇదిలా వుంటే తెలుగులో త్వరలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభమవుతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎప్పటిలాగే బుల్లితెర స్టార్లతో పాటు ఒకరిద్దరు హీరోయిన్లను కూడా రంగంలోకి దించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 'ఆర్‌ఎక్స్‌ 100' బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ బిగ్‌బాస్‌లో అడుగు పెట్టబోతుందన్న పుకారు ఫిల్మీదునియాలో మార్మోగిపోయింది.

ఈ వార్త పాయల్‌ దాకా చేరినట్లుంది. దీంతో ఈ పుకారుకు చెక్‌ పెడుతూ తాను బిగ్‌బాస్‌ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వడం అనేది ఫేక్‌ న్యూస్‌ అని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తల్లోకి తనను లాగొద్దని కోరుతూ ట్వీట్‌ చేసింది. ఇది చూసిన ఆమె అభిమానులు పాయల్‌ బిగ్‌బాస్‌లోకి వెళ్లకపోవడమే మంచిదంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: బిగ్‌బాస్‌ 5 : ముహూర్తం ఫిక్స్‌, షణ్ముఖ్‌, దుర్గారావు సహా కంటెస్టెంట్లు వీరే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top