Anasuya Bharadwaj Unexpected Comments on Allu Arjun Army - Sakshi
Sakshi News home page

Anasuya Bharadwaj: బన్నీ ఫ్యాన్స్‌ బాగా తిట్టారు, కానీ ఆయన మాత్రం..

Dec 22 2021 4:07 PM | Updated on Dec 22 2021 5:33 PM

Anasuya Bharadwaj Unexpected Comments on Allu Arjun Fans - Sakshi

నా లైఫ్‌లో బన్నీ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలీదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పాను బన్నీ, కానీ అది ఇంకోలా..

Pushpa Actress Anasuya Bharadwaj: ఐకాన్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప' సినిమా బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది. బొమ్మ ఏ థియేటర్‌లో పడినా తగ్గేదే లే అన్న రీతిలో కలెక్షన్లు రాబడుతోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా దేశంలో ఉన్న సినీ ప్రియులందరికీ పూనకాలు తెప్పిస్తోందీ చిత్రం. అంతటా పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందకుంటున్న పుష్ప సినిమా సక్సెస్‌ మీట్‌ను తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అనసూయ భరద్వాజ్‌ బన్నీ ఫ్యాన్స్‌పై కామెంట్లు చేసింది.

'ముందుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ గురించి చెప్తాను. ఇంటర్వ్యూల్లో ఆయన గురించి చాలా చెప్దాం అనుకున్నాను. కానీ తండ్రిని కోల్పోయిన బాధలో ఉండి ఇంటర్వ్యూలకు రాలేకపోయాను. ఈ రోజు చెప్తున్నా.. నా లైఫ్‌లో బన్నీ ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలీదు. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని ఒక పద్ధతిలో చెప్పాను బన్నీ, కానీ అది ఇంకోలా వెళ్లింది. మీ ఆర్మీ నన్ను బాగా తిట్టేశారు. ఈ విషయం మీదాకా వచ్చే ఉంటుంది. కానీ మీది చాలా పెద్ద మనసు. అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా మీరు ఇన్‌స్పిరేషన్‌. ఇకపోతే అందరితోపాటు నాకూ ఉన్న కంప్లైంట్‌ ఏంటంటే? పుష్పలో నన్ను చాలా తక్కువగా చూపించారు. రెండో భాగంలో మాత్రం చక్రం తిప్పుతా' అని చెప్పుకొచ్చింది అనసూయ.

(చదవండి: 'పుష్ప' సినిమాకు ఎవరి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement