ఇటలీలో ఆ హీరోతో సందడి చేస్తున్న అనసూయ

Anasuya Bharadwaj Enjoys Italy Tour With Ravi Teja For Khiladi Movie - Sakshi

జబర్దస్త్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ ప్రస్తుతం ఇటలీ వీధుల్లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ యాంకరమ్మ.. హీరో, మాస్‌ మహారాజ రవితేజతో కలిసి సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. రవితేజ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలొ రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరపుకుంటోంది. ఈ మూవీలో అనసూయ కీలక పాత్ర పోషిస్తోంది. 

ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు నటిస్తున్నారు. కాగా అనసూయ జబర్ధస్త్ షోకు యాంకర్‌గా వ్యవహరిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా వెండితెరపై మెరుస్తోంది. ఆమె నటించిన ‘క్షణం’ మూవీ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రంలో రంగమ్మత్తగా మంచి గుర్తింపు దక్కిచుకుంది. అంతేకాదు ఎప్పటికపుడు లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంటుంది.

ఇక మహిళ ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది. ఈ క్రమంలో అనసూయ తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇక తాజాగా మలయాళంలో కూడా ఆమెకు ఓ సినిమా అవకాశం వచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి చిత్రం ‘భీష్మ పర్వం’లో ఓ కీలక పాత్ర కోసం  ఎంపికైన ఆమె.. మరోవైపు మోహన్ లాల్ హీరోగా రానున్న ఓ సినిమాలో నటించేందుకు చిత్ర యూనిట్‌ అనసూయను సంప్రదించినట్లు సమాచారం.

చదవండి: 
ఇటలీలో అనసూయ వయ్యారాలు.. వీడియో వైరల్‌
సోషల్‌ హల్‌చల్: యూఎస్‌లో ‘జాతిరత్నాల’ రచ్చ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top