'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే? | Allu Arjun Review Dhurandhar 2 Movie Telugu Details | Sakshi
Sakshi News home page

Dhurandhar 2 Allu Arjun: 'ధురంధర్ 2'ని ఆకాశానికెత్తేసిన బన్నీ.. ట్వీట్ వైరల్

Mar 19 2026 7:57 AM | Updated on Mar 19 2026 11:32 AM

Allu Arjun Review Dhurandhar 2 Movie Telugu Details

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ వచ్చేసింది. నిన్నటి(మార్చి 18) నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడ్డాయి. చూసిన ప్రతిఒక్కరూ అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రీమియర్ చూసి తనదైన రివ్యూ ఇచ్చేశాడు. మూవీని ఆకాశానికెత్తేశాడు.

(ఇదీ చదవండి: ‘ధురంధర్‌ 2’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

'దేశభక్తి, స్వాగ్‌తో ఇప్పుడే 'ధురంధర్ 2' చూశాను. ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. సినిమాలో క్లాప్స్ కొట్టే సందర్భాలెన్నో. చిత్రబృందానికి శుభాకాంక్షలు. మాధవన్ సహా నటీనటులు అందరూ అదరగొట్టేశారు. నీలాంటి భిన్నమైన యాక్టర్ దేశంలో ఉండటం గర్వకారణంగా ఉంది బ్రదర్ రణ్‌వీర్ సింగ్. ఆదిత్య ధర్.. మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు. నీలాంటి దర్శకులు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. షో రాకర్. ఇది ఇంటర్నేషనల్ స్వాగ్‌తో తీసిన భారతీయ కథ. జైహింద్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.

మామ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైనప్పటికీ.. అల్లు అర్జున్ ముందుగా 'ధురంధర్ 2' చూసి ఏకంగా రివ్యూ ఇవ్వడం తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పవన్ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. మొత్తం నెగిటివ్ టాక్ వస్తోంది. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ తదితరులు.. 'ధురంధర్ 2' సినిమాని బుధవారం సాయంత్రం ‍అల్లు సినిమాస్‌ థియేటర్‌లో చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?)

Advertisement
 
Advertisement
Advertisement