
విజయ్ కృష్ణ, సంజనా చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం ‘అలర్ట్’. మూర్తి కొడిగంటి దర్శకత్వంలో మల్లిఖార్జున్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి బెక్కం వేణుగోపాల్ కెమెరా స్విచ్చాన్ చేయగా, కె.ఎల్. దామోదర ప్రసాద్ క్లాప్ ఇచ్చారు. వి. సముద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఆన్‌లైన్ మోసాలు ఎలా జరుగుతున్నాయి? అనే అంశాలపై సినిమా ఉంటుంది’’ అన్నారు విజయ్ కృష్ణ. ‘‘వాస్తవ ఘటనతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు మల్లిఖార్జున్. ‘‘అలర్ట్’ కథతో షార్ట్ ఫిల్మ్ చేశాం.. అది అందరికీ నచ్చడంతో సినిమా చేస్తున్నాం’’ అన్నారు మూర్తి కొడిగంటి.