AHA: కేటీఆర్‌ గారూ.. త్వరగా కోలుకోవాలంటే ఈ చిత్రం చూడండి..

Aha Hilarious Reply To Minister KTR Tweet To Watch OTT Shows - Sakshi

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ఎడమ కాలికి గాయమైన విషయం తెలిసిందే. దీంతో కేటీఆర్‌ను మూడు వారాలపాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించారు. ఈ క్రమంలో కేటీఆర్‌ ఖాళీగా ఉండటంకన్నా సినిమాలు చూస్తూ టైంపాస్‌ చేద్దామనుకుని భావించారు. అందుకోసమని ఓటీటీలో ఏదైనా మంచి కంటెంట్‌ ఉంటే చెప్పండని ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌కు ఓటీటీ సంస్థలు రెస్పాండ్‌ అవుతున్నాయి. మా ఓటీటీలో ఈ సినిమాలు చూడండంటూ రిప్లైలు ఇస్తున్నాయి. 

తాజాగా ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా.. కేటీఆర్ ట్వీట్‌కు స్పందించింది. ''పుట్టినరోజు శుభాకాంక్షలు. నవ్వుతో త్వరగా కోలుకునేందుకు డీజే టిల్లు సినిమాను చూడాలని వైద్యులు సిఫార్సు చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్‌', లూప్‌ థ్రిల్‌ను ఎంజాయ్‌ చేయడానికి అమలా పాల్‌ 'కుడి ఎడమైతే', ప్రియమణి ఇన్వెస్టిగేటివ్‌ డ్రామా 'భామ కలాపం' వీక్షించండి'' అని ట్వీట్‌ చేసింది. కాగా కేటీఆర్‌ ట్వీట్‌కు ఇంతకుముందు ఓటీటీ జీ5 తమ ప్లాట్‌ఫామ్‌లోని సినిమాలు, సిరీస్‌లను చూడమని రిప్లై ఇచ్చింది. ఇప్పుడు మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌కు ఇంకెన్ని ఓటీటీలు రెస్పాండ్‌ అవుతాయో చూడాలి. 

చదవండి: నగ్నంగా రణ్‌వీర్‌ సింగ్‌.. మానసిక రోగి అంటూ బ్యానర్లు
శ్రీదేవి చెప్పిన బ్యూటీ టిప్‌.. ఇప్పటికీ అదే ఫాలో అవుతున్న జాన్వీ

చదవండి: కేటీఆర్‌ గారూ, కాలక్షేపం కావాలంటే ఇవి చూసేయండి: జీ5

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top