అడివి శేష్‌ ‘మేజర్‌’ నుంచి రేపు బిగ్‌ సర్‌ప్రైజ్‌

Adivi Sesh Major Movie Latest Update - Sakshi

అడివి శేష్ హీరోగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘మేజ‌ర్‌’. గూఢ‌చారి ఫేం శ‌శికిర‌ణ టిక్కా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీని మహేష్ బాబు తన జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల హీరోయిన్‌గా నటిస్తోంది. ముంబై బాంబ్ బ్లాస్ట్‌లో వీర మరణం పొందించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని శశి కిరణ్ తెరకెక్కిస్తున్నాడు. మూవీ కోసం అడివి శేష్‌ తీవ్రంగా శ్రమించాడు. సినిమాలో తన మిలటరీ అధికారి క్యారెక్టర్‌ కావటంతో..నిజమైన సైనికుడిగా కనిపించేందుకు భారీగా వెయిట్ లాస్‌ అయ్యాడు. కాగా, ఈ సినిమా నుంచి తాజా అప్‌డేట్‌ వచ్చేసింది.

‘మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ స్టోరీ మా చిత్రానికి స్పూర్తినివ్వడమే కాకుండా.. మార్గనిర్దేశం కూడా చేసింది.  ఈ చిత్రం మన అందరి హృదయాలకు ఎందకు దగ్గరవుతుందో రేపు 10 గంటలకు చెబుతాం’ అంటూ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఓ విడియోని విడుదల చేసింది. ఇక విడియో చివరల్లో ‘ ది లుక్‌ టెస్ట్‌’ అని పేర్కొంది. దీన్ని బట్టి చూస్తే రేపు ‘మేజర్‌’ఫస్ట్‌ లుక్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ‘మేజ‌ర్’ చెప్పే  విషయాలు ఏంటో తెలియాలంటే శుక్రవారం వరకు ఆగాల్సిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top