మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు

Adivi Sesh Awareness Program On Disha App In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రతిష్టాత్మకంగా దిశ యాప్‌పై ఆదివారం బీచ్ రోడ్డులో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దీనికి సినీనటుడు అడవి శేషు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. రాఖీ పండుగ రోజు దిశ యాప్‌పై అవగాహన కల్పించడం బాగుందని, దిశ యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తారని ఆయన తెలిపారు.

ప్రస్తుతం అడవి శేషు ముంబయ్‌లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ‘మేజర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థలతో కలసి సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. హిందీ, తెలుగు, మలయాళంలో ఈ ఏడాదే ‘మేజర్‌’ రిలీజ్‌ కానున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top