● కలెక్టర్ ప్రతిమాసింగ్ ● నేటి నుంచి గ్రామాల్లో ‘అరైవ్– అలైవ్’
మెదక్ కలెక్టరేట్: నేటి నుంచి జిల్లాలోని 492 పంచాయతీల్లో ‘అరైవ్– అలైవ్’ గ్రామ సభలు పటిష్టంగా నిర్వహించాలని కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్ నుంచి అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రోడ్డు భద్రత మన అందరి బాధ్యత అన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలి, ప్రజలకు ప్రాణ రక్షణ కల్పించాలి అనే నినాదంతో అన్ని పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని అంశాల మీద గ్రామసభలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


