చల్మెడలో పెద్దపులి సంచారం
నిజాంపేట(మెదక్): మండల పరిధిలోని చల్మెడలో పులి ఆనవాళ్లు కనిపించాయి. శుక్రవారం ఫారెస్ట్ ఆఫీసర్ విద్యాసాగర్‌రావు గ్రామంలో పర్యటించా రు. వారం రోజులుగా కామారెడ్డి, మెదక్ జిల్లాలోని పెద్దమల్లారెడ్డి, కంచర్ల, చల్మెడ గ్రామాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా గుర్తించారు. చల్మెడ శివారులో గల మల్లన్న గుట్ట వద్ద పొ లంలో రైతు బర్రె పాలు పిండుకొని వస్తున్న క్రమంలో వెనుక నుంచి పులి పరిగెత్తుకొని వస్తున్నట్లు గమనించి కేకలు వేశారు. దీంతో పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. రైతు వెంటనే పోలీస్, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో అధికారులు హుటాహుటిన సంఘ టనా స్థలానికి చేరుకొని అనవాళ్లను సేకరించారు. గ్రామస్తులు మల్లన్న గుట్ట ప్రాంతంలో తిరగవద్దని.. ఎవరికై నా పెద్దపులి కనిపిస్తే సమాచారం అంది ంచాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. ఆయన వెంట ఎస్‌ఐ రాజేష్, ఫారెస్ట్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


