నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
పాపన్నపేట(మెదక్): మండల పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ ఏఈ నర్సింలు తెలిపారు. మిన్‌పూర్ 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు లు చేయనున్నట్లు చెప్పారు. దీంతో ఉద యం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జనవరిలో సర్టిఫికెట్
కోర్సు పరీక్షలు
మెదక్ కలెక్టరేట్: వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 13వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సుల పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కో ర్సుల్లో భాగంగా డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షలన్నీ జిల్లా కేంద్రంలో గుర్తించబడిన పరీక్ష కేంద్రంలో ఉంటాయని చెప్పారు.
వెబ్‌సైట్‌లో మెరిట్ లిస్ట్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని పలు కేజీబీవీలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అభ్యర్థుల మెరిట్ లి స్ట్ విద్యాశాఖ సైట్‌లో పొందుపర్చినట్లు డీఈఓ విజయ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. ఖాళీగా ఉన్న అకౌంటెంట్ (4), ఏఎన్‌ఎం (5) ఉద్యోగాల భర్తీ కోసం మహిళా అభ్యర్థుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అభ్యర్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేసి జాబితాను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు చెప్పారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం సవరణ మెరిట్ లిస్ట్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్ httpr:// medakdeo.comలో ఉంచినట్లు ఆమె వివరించారు.
ఆయిల్‌పామ్ సాగుతో
అధిక లాభాలు
చిన్నశంకరంపేట(మెదక్): ఆయిల్‌పామ్ సాగు తో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన అధికారి ప్రతాప్‌సింగ్ అన్నారు. శుక్రవారం మండలంలోని సూరారంలో సత్యనారాయణ అనే రైతు సాగు చేసిన ఆయిల్‌పామ్ మొక్కలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 2 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగు చేశారని తెలిపారు. అవసరమైన రక్షణ, పంట పెరుగుదలకు అవసరమైన సహాయం అందిస్తామని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించే రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో అయిల్‌పామ్ డైరెక్టర్ రంగనాయకులు, మేనేజర్ కృష్ణారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పంచాయతీ ముస్తాబు
అల్లాదుర్గం(మెదక్): ఈనెల 22న నూతన సర్పంచ్‌లు ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. ఇందుకోసం పంచాయతీ కార్యాలయాలు ము స్తాబు చేస్తున్నారు. మండల పరిధిలోని అప్పాజీపల్లి పంచాయతీకి కొత్తగా రంగులు వేసి కార్యాలయానికి మరమ్మతులు చేస్తున్నారు.
వణికిస్తున్న చలి పులి
చేగుంట(తూప్రాన్): చలి పులి ప్రజలను వణి కిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు చలి తీవ్రతను త ట్టుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం ఏడు గంటల వరకూ చలి తగ్గకపోవడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగ మంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


