పంచాయతీలో పై చేయి | - | Sakshi
Sakshi News home page

పంచాయతీలో పై చేయి

Dec 12 2025 5:45 PM | Updated on Dec 12 2025 5:45 PM

పంచాయ

పంచాయతీలో పై చేయి

బీఆర్‌ఎస్‌కు 41 స్థానాలు

మెదక్‌జోన్‌: హోరాహోరీగా సాగిన తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ సత్తా చాటింది. ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను కై వసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ తక్కువ సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలను రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. ఈ రెండు పార్టీల అభ్యర్థు లు పోటాపోటీగా ప్రచారం చేశారు. వారం రోజు ల పాటు ప్రచారాన్ని హోరెత్తించారు. పెద్ద మొత్తంలో ఎన్నికల్లో ఖర్చు చేశారు. మద్యం, మాంసం, విందులు ఇచ్చారు. కీలకమైన కులసంఘాలు, యువతను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.

95 సర్పంచ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

తొలి విడతలో జిల్లాలోని అల్లాదుర్గం, పెద్దశంకరంపేట, టేక్మాల్‌, రేగోడ్‌, పాపన్నపేట, హవేళిఘణాపూర్‌ మండలాల్లో ఎన్నికలు నిర్వహి ంచారు. 144 పంచాయతీలు, 1,069 వార్డు స్థానాలకు గురు వారం ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్‌ 95 సర్పంచ్‌ స్థానాలను గెలుచుకుంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

8 స్థానాల్లో స్వతంత్రులు..

కమలం పార్టీ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో ఖాతా తెరవలేదు. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ పంచాయతీ ఎన్నికలకు వచ్చే సరికి ఆ స్థాయి లో సత్తా చాటలేకపోయింది. మరోవైపు ఏ పార్టీ మద్దతు లేకుండా సొంతంగా బరిలోకి దిగిన స్వతంత్రులు 8 చోట్ల విజయం సాధించడం గమనార్హం. ఆయా గ్రామాల్లో అభ్యర్థికి ఉన్న మంచి పేరుతో విజయం సాధించినట్లయింది. ఈ గ్రామాల ప్రజ లు పార్టీలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థిని గెలిపించడం గమనార్హం.

రాత్రి వరకు కొనసాగిన కౌంటింగ్‌

ఓట్ల లెక్కింపు ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. చిన్న గ్రామ పంచాయతీల్లో సాయంత్రం 7 గంటల లోపు ఫలితాలు వచ్చాయి. కానీ మండల కేంద్రా లు, ఓటర్లు ఎక్కువగా ఉన్న పెద్ద గ్రామ పంచాయతీల్లో రాత్రి 10 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగింది.

కాంగ్రెస్‌ బలపరిచిన అభ్యర్థుల హవా

గట్టి పోటీ ఇచ్చిన గులాబీ పార్టీ మద్దతుదారులు

పలు చోట్ల సత్తా చాటిన స్వతంత్రులు

ఖాతా తెరవని కమలం

ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్‌ఎస్‌ తన పట్టు నిలుపుకొంది. అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 41 సర్పంచ్‌ స్థానా ల్లో గులాబీ పార్టీ మద్దతుదారులు విజయం సా ధించారు. కాంగ్రెస్‌తో పోలిస్తే బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలిచిన సర్పంచ్‌ స్థానాలు తక్కువే అయినప్పటికీ.. గట్టిపోటీని ఇవ్వడంతో గ్రామా ల్లో ఆ పార్టీకి ఆదరణను అంతగా తగ్గలేదని నిరూపించింది.

మొదటి విడత ప్రశాంతం: కలెక్టర్‌

మెదక్‌ కలెక్టరేట్‌: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ వెబ్‌ కాస్టింగ్‌ను గురువారం కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను కలెక్టరేట్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి నేరుగా వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆరు మండలాల్లో మొత్తం 33 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించి, పోలింగ్‌ ప్రక్రియను పర్యవేక్షించామని చెప్పారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నగేశ్‌, డీపీఓ యాదయ్య, ఈడీఎం సందీప్‌, డీఎల్‌పీఆర్‌ఓ రామచంద్ర రాజు పాల్గొన్నారు.

పంచాయతీలో పై చేయి1
1/2

పంచాయతీలో పై చేయి

పంచాయతీలో పై చేయి2
2/2

పంచాయతీలో పై చేయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement