మౌలిక వసతులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతులు తప్పనిసరి

Dec 11 2025 9:35 AM | Updated on Dec 11 2025 9:35 AM

మౌలిక వసతులు తప్పనిసరి

మౌలిక వసతులు తప్పనిసరి

మెదక్‌మున్సిపాలిటీ: పెట్రోల్‌ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా పౌర సరఫరాల అధికారి నిత్యానందం నిర్వాహకులకు సూచించారు. బుధవారం పట్టణంలోని ఓ పెట్రోల్‌బంక్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు. తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్‌ పేపర్‌ టెస్ట్‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్స్‌, ఫస్ట్‌ ఎయిడ్‌, టైర్లకు ఉచిత గాలి వంటి సదుపాయాల కల్పనలో పలు లోపాలు బయటపడ్డాయి. వినియోగదారులను మోసం చేసే విధంగా వ్యవహరించడంపై తీవ్రంగా ఖండించారు. బంక్‌పై ప్రాథమిక కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల కింద వివరణ కోరినట్లు తెలిపారు. అవసరమైతే సీజ్‌ చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

డీఎస్‌ఓ నిత్యానందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement