పకడ్బందీగా ఏర్పాట్లు
పాపన్నపేట(మెదక్): పంచాయతీ ఎన్నికలు జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో మొదటి విడత ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని సందర్శించారు. బ్యాలెట్ బాక్స్‌ల పనితీరు, వాటిని సీల్ చేసే విధానం, మాక్ పోలింగ్ తదితర విషయాలను ఎన్నికల అధికారులతో డె మో చేయించారు. పీఓ, ఏపీఓల హాజరు శాతాన్ని పరిశీలించారు. సిబ్బందికి అల్పాహారం, భోజన వసతి తదితర సౌకర్యాలపై ఆరాతీశారు. 24 గంటల పాటు విద్యుత్ సదుపాయం ఉండేలా చర్య లు తీసుకోవాలన్నారు. పోలింగ్ ఏజెంట్లకు తగిన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 411 మంది సర్పంచ్, 2,426 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని చెప్పారు. ఆరు మండలాల్లో 1,292 పోలింగ్ కేంద్రాలు, 1,421 పీఓలు, 1,529 ఓపీఓలు, 155 మంది రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు చెప్పారు. అనంతరం పాపన్నపేటలో ని ఎన్నికల బూత్‌లను పరిశీలించారు.


