ప్రశాంతంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నిర్వహించాలి

Dec 11 2025 9:34 AM | Updated on Dec 11 2025 9:34 AM

ప్రశా

ప్రశాంతంగా నిర్వహించాలి

ప్రశాంతంగా నిర్వహించాలి బురద మార్గం.. నిత్యం నరకం వసతులు ఏవీ?

పాపన్నపేట(మెదక్‌): మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్‌ అన్నారు. బుధవారం ఎన్నికల విధులకు వచ్చిన పోలీసులతో మాట్లాడారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. రూట్‌ మొబైల్‌, పోలింగ్‌స్టేషన్‌ భద్రత, సెక్టార్‌ మొబైల్‌, స్ట్రైకింగ్‌ ఫోర్స్‌ వంటి విభాగాలకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం టపాకాయ లు కాల్చడం, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం నిషేధమన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్సై శ్రీనివాస్‌గౌడ్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చేగుంట(తూప్రాన్‌): మండలంలోని పొలంపల్లి శివారులో ఏర్పాటు చేసిన రైల్వే అండర్‌ బ్రిడ్జి బురదమయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పొలంపల్లి నుంచి జాతీయ రహదారి వరకు మట్టిరోడ్డు ఉంది. గతంలో రోడ్డుపై నుంచి రైలు పట్టాలు ఉండగా, ప్రమాదాల నివారణ కోసం రైల్వే అధికారులు అండర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రిడ్జి కింద నీరు చేరగా, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో వెళ్లలే దు. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. రైల్వే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి

రామాయంపేట(మెదక్‌): ఇటీవల పెరిగిన చలిగాలి ప్రభావం వరినారుపై పడుతుందని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్‌ అన్నా రు. బుధవారం సాయంత్రం పట్టణ శివారులో వరినారు మడులను పరిశీలించి రైతులకు తగు సూచనలు చేశారు. చలితో వరినారులో జింక్‌ లోపం తలెత్తుతుందన్నారు. సూక్మ పోషకాల నివారణ కోసం ఫార్ములా ఫోర్‌ లేదా ఫార్ములా సిక్స్‌ ద్రావణాన్ని నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. ఆరోగ్యకరమైన వరినారు కోసం రైతులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా రాత్రివేళల్లో మడుల్లో నీరు తొలగించి ఉద యాన్నే బోరు నుంచి వచ్చే వేచ్చని నీరు పారించాలన్నారు. అగ్గితెగులు నివారణకు కార్బెండజిమ్‌, మాంకోజెబ్‌ మిశ్రమాన్ని లీటర్‌కు రెండు గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయా లని వివరించారు. ఆయన వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, రైతు లు ఉన్నారు.

రేగోడ్‌(మెదక్‌): సరైన వసతులు లేవంటూ పోలింగ్‌ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేసిన సంఘటన మండల కేంద్రంలోని రేగోడ్‌లో బుధవారం రాత్రి జరిగింది. ఏర్పాట్ల విషయమై ఎంపీడీఓను అడిగితే.. డ్యూటీ చేయడానికి వచ్చారా..? ఎంజాయ్‌ చేయడానికి వచ్చారా అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని వాపోయారు. వసతు లు లేకుంటే మహిళలు ఎలా ఉండాలని ప్రశ్నించారు. ఈ విషయమై ఎంపీడీఓ సీతారావమ్మ వద్ద ప్రస్తావించగా, సిబ్బంది ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఇబ్బందులు ఎదురయ్యాయని, వసతులు కల్పించామని చెప్పారు.

ప్రశాంతంగా నిర్వహించాలి 
1
1/3

ప్రశాంతంగా నిర్వహించాలి

ప్రశాంతంగా నిర్వహించాలి 
2
2/3

ప్రశాంతంగా నిర్వహించాలి

ప్రశాంతంగా నిర్వహించాలి 
3
3/3

ప్రశాంతంగా నిర్వహించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement