రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవిద్దాం
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్‌కలెక్టరేట్/పాపన్నపేట/టేక్మాల్: డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ రా జ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాజ్యాంగంలో పొ ందుపరిచిన అంశాలకు అనుగుణంగా నడుచుకుంటామని అధికారులతో కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, కలెక్టరేట్ ఏఓ యూనస్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమి షనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా అఽ దికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారానికి సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని ఆదేశించారు. నేటి నుంచి జిల్లాలో జరుగనున్న ఎన్నికల ప్రక్రియను అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. పోలింగ్ నుంచి కౌంటింగ్ వరకు జరిగే ప్రతీ ప్రక్రియ పైన సమగ్ర అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పాపన్నపేట, టేక్మాల్ మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల ఏర్పాట్లను పరిశీలించారు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


