సం‘గ్రామమే’
జిల్లాలో మొదటి విడతలో 160 పంచాయతీలు.. 1,402 వార్డు స్థానాలకు ఎన్నికలు ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
మెదక్ కలెక్టరేట్: పంచాయతీ ఎన్నికల తొలి ఘ ట్టానికి వేళయింది. గురువారం ఎన్నికల మొ దటి విడత నోటిఫికేషన్ విడుదలతో పాటు నా మినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మూడు రోజుల పాటు ఆయా గ్రామాలకు కేటాయించిన కేంద్రాల్లో అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 29 వరకు నామినేషన్లు స్వీకరణ , 30 వరకు పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2న పరిష్కారం, 3న ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు.
147 మంది రిటర్నింగ్ అధికారులు
నామినేషన్లు స్వీకరణకు 147 మంది రిటర్నింగ్ అధికారులను నియమించారు. రిటర్నింగ్ అధికారుల కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించారు. నామినేషన్‌లో ఖచ్చితంగా తేదీ, సమయం, క్రమసంఖ్య నమోదు చేయాల్సి ఉంది. అభ్యర్థి సంతకం, ధ్రువీకరణ ప్రతిపాదన చేసిన వ్యక్తి సంతకం తప్పనిసరి. కాగా జిల్లాలో మొదటి విడతలో 160 గ్రామ పంచాయతీలు, 1,402 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈమేరకు ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేశారు.
ఇప్పటికే ఆర్‌ఓలకు శిక్షణ
ఇప్పటికే ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. జోనల్, మండల ఆఫీసర్లు, ఎంసీసీ నోడల్ ఆఫీసర్లు, ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ టీంలను నియమించి శిక్షణ పూర్తిచేశారు. అన్ని ఆర్‌ఓ కార్యాలయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కాగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు స్వీకరించనున్న మండల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాల్లో నామినేషన్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ బుధవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ, ఇతర వివరాలు తెలిపే బో ర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ


