
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
● ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
● జిల్లాలో 41 మంది పిల్లలు, 8 కేసులు
మెదక్ మున్సిపాలిటీ: బాలకార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత 10 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్‌లో 41 మంది పిల్లలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. అన్నిశాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ దిగ్విజయంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యంగా హోటళ్లు, ఇటుక బట్టీలు, నిర్మాణ పనులు, వ్యాపా ర సముదాయాల్లో పనిచేస్తున్న బాల కార్మికులను గు ర్తించి వారి తల్లిదండ్రులకు లేదా సంరక్షణ గృహాలకు తరలించి యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల బాల్యం బడులకు అంకితం కావాలని, కార్మికులుగా కర్షకులుగా కొనసాగరాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు జిల్లా లో 8 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. బాల కార్మికులను పనిలో ఉంచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కా ర్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, మధుసూదన్ గౌడ్, సీడీపీఓ కరుణ శ్రీ, చైల్డ్‌వెల్ఫేర్ అధికారి ఉప్ప లయ్య, ఇతర అధికారులు, ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు పాల్గొన్నారు.