
ఆయిల్‌పామ్ లక్ష్యం 2,500ఎకరాలు
రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ సునీత
కౌడిపల్లి(నర్సాపూర్): జిల్లాలో ఈ ఏడాది ఆయిల్‌పామ్ సాగు 2,500 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు రాష్ట్ర ఉద్యానశాఖ జేడీ సునీత వెల్లడించారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో టమాటా రైతు మహిపాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో కాకర, బీర కూరగాలయ పంటను, ముట్రాజ్‌పల్లి ఆయిల్‌పామ్ సాగును జిల్లా అధికారి ప్రతాప్‌సింగ్‌తో కలిసి మంగళవారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటివరకు 1,739 రైతులు ఆయిల్ పామ్ సాగు కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 930మంది రైతువాటాగా మొక్కలకు డబ్బులు కూడా చెల్లించారని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని ఒక్కసారి మొక్క నాటితే నాల్గవ ఏట నుంచి పంట కోతకు వస్తుందన్నారు. ఏడాదికి ఎకరాకు రూ 1.40లక్షల ఆదాయం వస్తుందని చెప్పారు. నాలుగేళ్లపాటు అంతర పంటగా సాగుచేసి అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. కూరగాయల పంటలకు సైతం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని, ఎకరా పందిరి సాగుకు రూ.1లక్ష సబ్సిడీ వస్తుందని వివరించారు. కార్యక్రమంలో డీహెచ్‌ఓ ప్రతాప్‌సింగ్, హార్టికల్చర్ అధికారి సంతోష్, రైతు మహిపాల్‌రెడ్డి, మౌనిక రైతులు కొర్రశ్రీను పాల్గొన్నారు.
మెదక్ కలెక్టరేట్: ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సునీత తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.3.83 కోట్లు
● 16 మున్సిపాలిటీలకు కేటాయింపు
● అత్యధికంగా సిద్దిపేటకు.. అత్యల్పంగా రామాయంపేటకు
● మెరుగుపడనున్న పట్టణాలు