
జిల్లాలో 30,30(ఎ) యాక్ట్ అమలు
జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని (జులై 1న నుంచి 31 వరకు) జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్ 1861 అమలులో ఉంటుందని మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతి లేకుండా జిల్లాలో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన లు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించొద్దన్నారు. అలాగే ప్రజాధనాన్ని నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు సహకరించాలని కోరారు.
భరోసా సిబ్బంది కృషి అభినందనీయం
మెదక్ మున్సిపాలిటీ: ఫోక్సో కేసులు నిందితుడికి శిక్ష పడేలా విశేష కృషి చేసిన భరోసా సిబ్బందిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అభినందించారు. ఆరేళ్ల బాలికపై జరిగిన లైంగికదాడి కేసులో శిక్షపడేలా కృషి చేసిన భరోసా సిబ్బందికి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ చారుసిన్హా ప్రశంసా పత్రం అందజేశారు. ఈ తీర్పు భరోసా కేంద్రం యొక్క న్యాయ, మానసిక, సాంకేతిక సేవలపై అంకితభావాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. భవిష్యత్తులోనూ బాధితులకు న్యాయం, మానసిక బలాన్ని అందించేందుకు భరోసా కేంద్రం కృషి చేస్తూనే ఉంటుందన్నారు.