
మాదకద్రవ్యాలతో ఆరోగ్యానికి ముప్పు
హవేళిఘణాపూర్(మెదక్): విద్యార్థులు మాదకద్రవ్యాల వలన కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. సోమవారం మెదక్ మండల పరిధిలోని రాజ్‌పల్లిలో మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జెడ్పీ హైస్కూల్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాలతో అనేక మంది అనారోగ్యం బారినపడి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. అందుకోసం ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించి ప్రాణాలు కాపాడునే విధంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలు నాటి, వాటిని కాపాడే విధంగా చూడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి హైమావతి, ఎంపీడీఓ రఘు, హెచ్‌ఎం శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ నగేశ్