పోషకాహార లోపాన్ని నివారిద్దాం
నర్సాపూర్ రూరల్: పేద, మధ్య తరగతి కుటుంబాల పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతివారం ఎగ్ బిర్యానీ వంటకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని రెడ్డిపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ వంటకం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటపాటలతో కూడిన విద్యను నేర్పించి వారిలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేస్తూ వేతనాలు పెంచిందన్నారు. పిల్లలకు ఆట వస్తువులతో పాటు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీడీపీఓ హేమభార్గవి, ఎంపీడీఓ మధులత, సూపర్‌వైజర్ సరళ, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసినిరెడ్డి


