
రసాయనాల వాడకం తగ్గించాలి
సీఎం సహకారంతో అభివృద్ధి చేస్తా
మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు
క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలి
ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి
చిన్నశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తానని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు అన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశా రు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చొరవ తీసుకుంటానన్నారు. ప్రతి పాఠశాలలో ముందుగా మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టడంతో పాటు మౌలిక సౌకర్యాల క ల్పనకు కృషి చేస్తానన్నారు. మెదక్ నియోజకవర్గాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతానని తెలిపారు. అనంతరం పదో తరగతిలో మండల టాపర్‌గా నిలిచిన మడూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థిని రాజేశ్వరిని సన్మానించారు. అలాగే మండలంలోని ధరిపల్లిలో జరుగుతున్న బీరప్ప జాతరలో పా ల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మన్నన్, ఎంపీడీఓ దామోదర్, డీఎస్పీ వెంకట్‌రెడ్డి, ఎంఈఓ పుష్పవేణి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ సిబ్బంది పిల్లలు క్రీడల్లో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలని ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆకాంక్షించారు. సో మవారం జిల్లా కేంద్రంలోని అవుట్‌డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన టర్మ్ క్రికెట్ కోచింగ్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. జాతీయ క్రీడాకారుడు కానిస్టేబుల్ సాయి ఆధ్వర్యంలో కోచింగ్ క్యాంపు నడుస్తుందని తెలిపారు. పేద పిల్లలు, పోలీస్ సిబ్బంది పిల్లలు ఈ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ డీఎస్పీ రంగానాయక్, మెదక్ టౌన్ సీఐ నాగరాజు, ఆర్‌ఐ శైలందర్ సిబ్బంది త దితరులు పాల్గొన్నారు.
తూప్రాన్: రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా మండలంలోని రావెళ్లి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కీటక శాస్త్రవేత రాజశేఖర్ రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. వానాకాలం సీజన్‌కు సంబంధించి యాజమాన్య పద్ధతుల గురించి చెప్పారు. ముఖ్యంగా తక్కువ యూరియా వాడకం, రసాయన పురుగు మందులు వాడటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమర్థ నీటి వినియోగం, విత్తన, నేల శుద్ధి, పంట మార్పిడి వంటి వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి క్షుణ్ణంగా వివరించారు. రైతులు కొనుగోలు చేసిన వాటికి సంబంధించిన రసీదులు జాగ్రత్త పర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గంగమల్లు, వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్, కౌన్సిలర్ రాజు, నవీన్, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తప్పకుండా ఒక బస్తా యూరియా తక్కువ వాడుతాం అని రైతులతో ప్రతిజ్ఞ చేయించారు.
రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్త సూచన

రసాయనాల వాడకం తగ్గించాలి

రసాయనాల వాడకం తగ్గించాలి