
ఆదర్శనీయుడు అంబేడ్కర్
చిన్నశంకరంపేట(మెదక్): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశ గమనాన్ని మార్చిన గొప్ప నాయకుడని, ఆయన మార్గదర్శనం ఆదర్శనీయమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మండలంలోని గజగట్లపల్లిలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభ్యున్నతిలో అంబేడ్కర్ పాత్ర గొప్పదన్నారు. ఆయన ముందుచూపు వల్లే నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, లక్ష్మారెడ్డి, పట్లోరి రాజు, బండారు స్వామి, మాజీ మున్సిపల్ చైర్మన్లు జితేందర్‌గౌడ్, మల్లికార్జున్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు రవీందర్, కుమార్‌గౌడ్, యాదగిరి, లక్ష్మణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
కల్తీ విత్తనాలు
విక్రయిస్తే చర్యలు
నర్సాపూర్ రూరల్: కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హేమలత హె చ్చరించారు. బుధవారం మండలంలోని చిప్పల్‌తుర్తిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి వెన్నముక లాంటి రైతులను మోసం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే ముందు నాణ్యత ప్రమాణాలు చూసుకోవాలని సూచించారు. ప్రతి రైతు సేంద్రియ ఎరువులను వాడి పంటలు సాగు చేస్తే ప్రజల ఆరోగ్యంతో పాటు మంచి లాభాలు ఉంటాయన్నారు. రైతులు పంట సాగులో వచ్చే సమస్యలతో పాటు ఆర్థిక కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని అన్నారు. పేద రైతులకు చట్టపరమైన సమస్యలు ఉంటే ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
సాంకేతికతను
జోడిస్తూ బోధించాలి
మెదక్ కలెక్టరేట్: బోధనలో అత్యాధునిక సాంకేతికతను జోడించి బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడు భాస్కర్‌దేశ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో భౌతిక, రసాయనశాస్త్ర ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు సన్న ద్ధం అయినట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాఠశాలల్లో విద్యార్థులకు ఆసక్తి కలిగేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను బోధనలో వినియోగించాలని వివరించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, కోర్స్ కో ఆర్డినేటర్, హెచ్‌ఎం రేఖ, రిసోర్స్ పర్సన్లు మహేందర్, రాజ్‌కుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి ఇంటర్
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ
మెదక్ కలెక్టరేట్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నుంచి జరగనున్నాయి. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 22 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 130 మంది ఇన్విజిలెటర్లను కేటాయించారు.ఫస్ట్ ఇయర్‌లో 3,626 మంది, సెకండ్ ఇయర్‌లో 2,214 మంది కలిపి మొత్తం 5,840 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. సీసీ కెమెరాల నిఘాలో కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

ఆదర్శనీయుడు అంబేడ్కర్

ఆదర్శనీయుడు అంబేడ్కర్