
చిరస్మరణీయుడు రాజీవ్‌గాంధీ
నర్సాపూర్ రూరల్: రాజీవ్‌గాంధీ చిరస్మరణీయుడని, ఆయన ఆశయ సాధనకు యువత కృషి చేయా లని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. బుధవారం పార్టీ క్యాంపు కార్యాలయంలో రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక భారత నిర్మాణానికి రాజీవ్‌గాంధీ ఎంతో కృషి చేశారని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావాలని అనేక కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్‌గుప్తా, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, లలిత, నగేష్, సురేందర్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, రషీద్, రవి, సురేష్, అజ్మత్, కార్యకర్తలు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్