
క్యూఆర్‌కోడ్ సిటిజన్ లో ప్రథమం
ఉత్తమ పోలీస్‌స్టేషన్లుగా నర్సాపూర్, తూప్రాన్
మెదక్ మున్సిపాలిటీ: పోలీసుల పనితీరు, ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు తెలుసుకునేందుకు రాష్ట్ర పోలీస్‌శాఖ ఈ ఏడాది నిర్వహించిన క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్ సర్వేలో జిల్లా మొదటిస్థానంలో నిలిచినట్లు ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్టిఫికేషన్ కార్యక్రమంలో జిల్లా నుంచి అదనపు ఎస్పీ మహేందర్ హాజరై సర్టిఫికెట్ అందుకున్నట్లు చెప్పారు. సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో రాష్ట్రంలోనే 10 ఉత్తమ పోలీస్‌స్టేషన్లలో నర్సాపూర్‌కు 1వ స్థానం,తూప్రాన్‌కు 4వ స్థానం వచ్చినట్లు వివరించారు. ఆయా పోలీస్‌స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు డీజీపీ చేతుల మీదగా సర్టిఫికెట్లు అందుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపే ఎక్కువగా చార్జిషీట్లు వేసినందుకు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి రాష్ట్రంలోనే రెండో స్థానం పొంది అదనపు డీజీపీ అనిల్‌కుమార్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నట్లు పేర్కొన్నారు.