
తగ్గిన శిశు మరణాలు
ఉమ్మడి మెదక్ జిల్లాలో శిశు మరణాలు తగ్గాయి. 2020లో 541 మంది చిన్నారులు మృతి చెందితే అందులో మగవాళ్లు 285, ఆడవాళ్లు 256 మంది ఉన్నారు. 2021లో 427 మంది చిన్నారులు మృతి చెందగా అందులో మగ వారు 234, ఆడ శిశువులు 193 మంది ఉన్నారు. రెండేళ్లలో ఆడ శిశువులు తక్కువగానే మృతి చెందారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో శిశు మరణాలు తగ్గాయని చెప్పవచ్చు.
2021లో శిశు మరణాలు
జిల్లా మగ ఆడ మొత్తం
మెదక్ 148 119 267
సిద్దిపేట 20 19 39
సంగారెడ్డి 66 55 121