
స్వస్థలం.. చదువు.. కుటుంబ నేపథ్యం
కమ్యూనిటీ పోలీసింగ్ అవార్డు అందుకుంటూ..
ఉదయ్‌కుమార్‌ది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాంచంద్రాపురం గ్రామం. తల్లిదండ్రులు దేవరపల్లి సామ్రాజ్యం– సుబ్బారెడ్డి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఆయనకు సోదరి అరుణ ఉన్నారు. సొంత గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు, 6, 7 తరగతులు సమీప గ్రామమైన సుర్దెపల్లికి కాలినడకన వెళ్లి చదువుకున్నారు. 8, 9 నేలకొండపల్లి.. పదో తరగతి నల్గొండ జిల్లా కోదాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు. ఇంటర్ నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, డిగ్రీ (బీఏ) కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి పట్టా పొందారు. ఈక్రమంలో 1986లో అరుణతో వివాహం జరిగింది. విద్యాభ్యాసం పూర్తయ్యాక టీచర్ కావాలని అనుకున్నారు. ఉద్యోగ వేటలో భాగంగా 1991లో ఎస్సైగా మొదటి ప్రయత్నంలో ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీ 1991 బ్యాచ్‌లో షూటింగ్‌లో ప్రథమస్థానం సాధించి అప్పటి హోం మంత్రి మైసూరారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. వీరికి కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు సాధన ప్రస్తుతం అమెరికాలో స్థిరపడగా, కుమారుడు సంతోష్‌రెడ్డి సివిల్ ఇంజినీర్‌గా హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు.

స్వస్థలం.. చదువు.. కుటుంబ నేపథ్యం