జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి తిరుపతి
వర్గల్(గజ్వేల్): గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, జ్ఞాన వికాసం కోసం విద్యార్థిలోకం పుస్తక పఠనం అలవరచుకోవాలని జ్యోతిబాపూలే బీసీ గురుకుల సొసైటీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి తిరుపతి అన్నారు. మంగళవారం వర్గల్ పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలను రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మద్దిలేటితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక గ్రంథాలు, పుస్తకాలు, రెఫరెన్స్ బుక్స్ తదితర పుస్తకాలతో కొలువైన గ్రంథాలయాలను స ద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం మనోవికాసానికి దోహదపడుతుందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో హైదరాబాద్, మెదక్ ఆర్సీఓలు ఆదిత్యవర్మ, ప్రభాకర్‌రావు, ప్రిన్సిపాల్ డాక్టర్ భాస్కర్‌రావు, వీపీ గోవింరావు, ఏటీపీ కే. భాగ్యలక్ష్మి, డీడబ్ల్యూజీ. భాగ్యలక్ష్మి, గ్రంథాలయాధికారి పావని తదితరులు పాల్గొన్నారు.