
మెప్మా ఆధ్వర్యంలో వెలిగించిన దీపాలు
సిద్దిపేట మున్సిపాలిటీలో స్వచ్ఛ దీపోత్సవం చేపట్టారు. దీపావళి పండుగ సందర్భంగా శుక్రవారం ముందస్తుగా మెప్మా ఆధ్వర్యంలో పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు. మెప్మా పరిధిలో పనిచేసే మహిళలు, ఆర్పీలు, సీఓలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించారు. స్వచ్ఛ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, బల్దియా ఆదర్శంగా ఉండాలని కమిషనర్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో మెప్మా సీఓ రమ్య, ఆర్పీ మమత తదితరులు పాల్గొన్నారు.
– సిద్దిపేటజోన్