పాపన్నపేట(మెదక్): నిబంధనలు పాటిస్తూ వినాయక నిమజ్జనం జరుపుకోవాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. గురవారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి, అనంతరం విలేకరులతో మాట్లాడారు. నిమజ్జన సమయంలో భక్తులు లోతుగా ఉన్న నీటిలో వెళ్లొద్దన్నారు. మండపాల వద్ద నిర్వాహకులు కాపలా ఉండాలని, విగ్రహాలను తీసుకువెళ్లే సమయంలో రోడ్డుపై విద్యుత్ తీగలు, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూసుకోవాలన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, మెదక్, రామాయంపేట స్టేషన్లకు ఇటీవల ఇద్దరు సీఐలు వచ్చారని, 168 కానిస్టేబుల్ ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూప్‌ల్లో రెచ్చగొట్టే సందేశాలు, తప్పుడు సమాచారం పంపించొద్దని అన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ మహిపాల్ రెడ్డి ఉన్నారు.