
సిబ్బందితో ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
ఎస్పీ రోహిణి ప్రియదర్శిని
మెదక్ మున్సిపాలిటీ: పోలీస్ వృత్తి అత్యంత కఠినతరమైందని, అన్నిరకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుందని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్‌సిబ్బందికి రేయిన్‌కోట్లు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సిబ్బంది, అధికారులు ఆరోగ్యంగా ఉండేందుకు తగు జాగ్రతలు తీసుకోవాలని, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రతీ రోజు వ్యాయామం, యోగా చేస్తుండాలని, మేలైన ఆహార అలవాట్లతో రోగాలు దరచేరవని అన్నారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. నిత్యం రోడ్డుపై డ్యూటీలో ఉండే పోలీస్ సిబ్బంది ఆరోగ్యం దృష్ట్యా పోలీస్‌శాఖ గుర్తులతో కూడిన రేయిన్ కోట్లు అందిస్తున్నామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్.ఐలు అచ్యుత రావు, నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.