సర్పంచ్ అభ్యర్థి ఆందోళన
నర్సాపూర్ (జీ): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని గొల్లమాడ గ్రామంలో ఈనెల 14న ఎన్నికలు నిర్వహించారు. ఓట్ల లెక్కింపులో ఎన్నికల అధికారులు గందరగోళం చేయడంతో తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ సర్పంచ్ అభ్యర్థులు అనూషాబాయి, ధనగరి లక్ష్మి ఎంపీడీవో పుష్పలతకు వినతిపత్రం అందజేశారు. లెక్కింపులో గందరగోళం సృష్టించి ఓట్లన్నీ తారుమారు చేశారని ఆరోపించారు. ఎన్నికల శిక్షణలో అవగాహన లేని అధికారులను విధుల్లోకి తీసుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుందని సర్పంచ్ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద అనుచరులు, నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలున్నాయని రీకౌంటింగ్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు త్వరలో నిర్వహించనున్న పంచాయతీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలివేయాలని కోరారు. ఈ విష యమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సర్పంచ్ అభ్యర్థి అనూషాబాయి తెలిపారు. ముధోల్ బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రమాదేవి, నాయకులు గాదేవార్ విలాస్, దీక్షిత్ పటేల్ తదితరులున్నారు.
ఆందోళన చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి, నాయకులు


