కలప వాహనం పట్టివేత
దండేపల్లి: మండలంలోని చింతపల్లి శివారులో అ నుమతి లేకుండా అక్రమంగా నాన్‌టేకు చెట్టు నరికి వాహనంలో తరలిస్తుండంగా అటవీశాఖ అధికారులు చింతపల్లి–కొర్విచెల్మ గ్రామాల మధ్య శుక్రవారం పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయానికి తరలించారు. అనుమతి లేకుండా చెట్లు నరికితే చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు నాగరాజుచారి, నరేశ్ హెచ్చరించారు.
మండలంలో జోరుగా దందా..
దండేపల్లి మండలంలో నాన్‌టేకు కలప దందా కొ ద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. రహదారులు, కాలువల వెంట, విద్యుత్ తీగల కింద ఉన్న తు మ్మ, వేప, ఇతర నాన్‌టేకు చెట్లు, చెట్ల కొమ్మలపై కొంతమంది కన్నేసి దర్జాగా నరికేస్తున్నారు. అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముత్యంపేట అటవీ చెక్‌పోస్టు గుండా ఈ దందా నిత్యం సాగుతున్నా అటవీశాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


