జీజీహెచ్‌లో దయ్యం ఉన్నట్లు ప్రచారం
మంచిర్యాలటౌన్: మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆ సుపత్రిలో ఒక రహస్యమైన నీడ కనిపిస్తున్నట్లు ఒక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఓపీ విభాగంలోని ల్యాబ్ వైపున బుధవారం అర్ధరాత్రి 12:36గంటలకు ఒక రహస్యమైన నీడ కనిపించినట్లు వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వేదవ్యాస్ ఔట్ పోస్టు పోలీసులకు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఫేక్ వీడియోను తయారు చేసినా, వాటిని షేర్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని, ఆసుపత్రి వారు చేస్తే, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇలాంటి ఫేక్ వీడియోలను ప్రజలు నమ్మొద్దని కోరారు.


