డయల్ యువర్ డీఎంకు సమస్యల వెల్లువ
మంచిర్యాలఅర్బన్: సార్.. మా ఊరి బస్టాప్‌లో బస్సులు నిలపండి.. పల్లె వెలుగులకు ఎక్స్‌ప్రెస్ బోర్డులు ఏర్పాటు చేసి డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారంటూ గురువారం నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు ప్రయాణికుల నుంచి సమస్యలు వెల్లువెత్తాయి. జన్నారం బస్‌స్టేషన్ శిథిలమైందని, ఆధునీకరించి ప్రయాణికులకు సౌకర్యం కల్పించా లని ఎక్కువ మంది విన్నవించగా సంబంధిత ఇంజ నీరింగ్ విభాగం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని డీఎం శ్రీనివాసులు సమాధానం ఇచ్చారు. జన్నారం మండలం లక్ష్మీదేవర ఆలయం వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలిపితే సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు కోరగా సంబంధిత డిపో అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కరించేందుకు ప్రయత్నిస్తానని డీఎం సమాధానం ఇచ్చారు. పల్లెవెలుగు బస్సులను ఎక్స్‌ప్రెస్ బోర్డుతో నడిపించి మంచిర్యాల నుంచి లక్సెటిపేటకు ఆర్డినరీ బస్సుల కంటే డబుల్ చార్జీలు తీసుకుంటూ ప్రయాణికులపై భారం మోపుతున్నారని విజయ్ భాస్కర్ అనే ప్రయాణికుడు డీఎం దృష్టికి తీసుకురాగా, మంచిర్యాల డిపో బస్సులు ఆర్డినరీకి ఎక్స్‌ప్రెస్‌గా నడపటం లేదని జగిత్యాల, కోరుట్ల బస్సులు నడపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని డిపో అధికారులకు సమాచారం అందిస్తామని డీఎం హామీ ఇచ్చారు. పాతమంచిర్యాల, రంగంపేట్ మీదుగా పులిమడుగు బస్సు నడపాలని, డీ–మార్ట్ దగ్గర బస్సులు నిలపాలని నారాయణ అనే ప్రయాణికుడు కోరగా కొత్తగా బస్సులు వచ్చినప్పుడు సర్వే చేసి బస్సు నడిపే ప్రయత్నం చేస్తానని డీఎం సమాధానం ఇచ్చారు. రాజీవ్‌నగర్‌కు బస్సుల సంఖ్య పెంచాలని, చెన్నూర్ నుంచి వచ్చే బస్సులు తోళ్లవాగు దగ్గర నిలపాలని, పరీక్షల సమయంలో బస్సుల సంఖ్య పెంచాలని పీడీఎస్‌యూ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ దృష్టికి తీసుకురాగా రాజీవ్‌నగర్‌కు మూడు బస్సులు నడుస్తున్నాయని, పరీక్షల సమయంలో తెలియజేస్తే వాటికి అనుగుణంగా బస్సులు నడుపుతామని డీఎం సుముఖత వ్యక్తం చేశారు. జన్నారం చింతగూడ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలపాలని రాజేందర్, భూమేశ్ అనే ప్రయాణికులు కోరగా జన్నారం చింతగూడ ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్ మంచిర్యాల బస్సులు నడుస్తాయని ఎక్స్‌ప్రెస్ స్టేజీ గురించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని డీఎం తెలిపారు. జన్నారం–జగిత్యాల, మంచి ర్యాల డిపో బస్సులు నడపాలని సాయంత్రం నిర్మల్–మంచిర్యాల బస్సుల సంఖ్య పెంచాలని భూమే శ్ సూచించగా జన్నారం–జగిత్యాల మార్గంలో జగిత్యాల డిపో బస్సులు నడుస్తున్నాయని, నిర్మల్–మంచిర్యాల సాయంత్రం 5, 6గంటలకు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయని డీఎం అన్నారు. జన్నారం నుంచి వేములవాడకు బస్సులు నడపాలని మహేష్ కోరగా జగిత్యాల డిపోకు సమాచారం ఇస్తామని డీఎం తెలిపారు. జన్నారం నుంచి భాగ్యనగర్ లింక్ బస్సు కావాలని శివరామక్రిష్ణ కోరగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. మంచిర్యాల నుంచి రేచినికి బస్సులు నడపాలని వేణుగోపాల్ సూచించగా కొత్త బస్సులు వచ్చాక పరిశీలించి నడిపేందుకు ప్రయత్నిస్తానని డీఎం అన్నారు. సబ్బెపల్లి సమీపంలోని పైపుల కంపెనీ వద్ద బస్సులు నిలపాలని సత్యనారాయణ కోరగా పరిశీలిస్తామన్నారు. ఇటిక్యాల్ బస్టాప్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు నిలపాలని ప్రమోద్‌కుమార్ కోరగా హజీపూర్, దొనబంబడ, లక్సెట్టిపేటలో ఎక్స్‌ప్రెస్ స్టేజీలున్నాయని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తానని డీఎం తెలిపారు.


