సర్పంచులు ప్రజా సేవకు అంకితం కావాలి
బెల్లంపల్లి: సర్పంచులు ప్రజాసేవకు అంకితం కావాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అ న్నారు. బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నూతనంగా ఎన్నికై న సర్పంచులను డీసీసీ అధ్యక్షుడు పి.రఘునాథ్‌రెడ్డితో కలిసి గు రువారం సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో మౌళిక వసతులపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్ర తిఒక్కరికి అందేలా కృషి చేయాలని సర్పంచులకు పిలుపుఇచ్చారు. డీసీసీ అధ్యక్షుడు రఘునా థ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి అభివృద్ధికి పాటుపడాలన్నారు.
కాంగ్రెస్ శ్రేణుల తోపులాట..
సర్పంచుల సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు తోపులాడుకున్నారు. ఎన్నికల బరిలో కాంగ్రెస్ రెబెల్‌గా పోటీచేసి గెలిచిన సర్పంచ్‌కు సన్మానం చేయడానికి ఆహ్వానించడంతో వేదిక మీదికి రాకుండా ప్రత్యర్థి వర్గం శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు ఒకరినొకరు తోపులాడుకోగా ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు నిశ్చేష్టులై చూడాల్సి వచ్చింది. అంతలోనే ముఖ్యనాయకులు జ్యోక్యం కలిపించుకొని సముదాయించడంతో గొడవ సద్దు మణిగింది. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ కారుకూరి రాంచందర్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, తాండూర్, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, కాసిపేట, నెన్నెల మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


