ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
కాసిపేట: మండలంలోని దేవాపూర్‌కు చెందిన రామిళ్ల లింగయ్య(55) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు దేవాపూర్ ఎస్సై గంగారాం తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం... ఎస్సీ కాలనీకి చెందిన లింగయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అప్పులు చేసి పెద్ద కూతురుకి వివాహం చేశాడు. రెండో కూతురుకు పెళ్లి చేయాలనే బాధతో మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 11న మధ్యాహ్నం 3గంటలకు ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం 5గంటలకు వచ్చాడు. దేవాపూర్ శివారులోని అడవికి వెళ్లి మద్యం మత్తులో నల్లపొడిసె చెక్క తాగి వచ్చినట్లు చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుమారుడు రామిళ్ల దిలీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


