అన్నపై తమ్ముడు.. చెల్లైపె అక్క
తిర్యాణి(ఆసిఫాబాద్): తిర్యాణి మండలంలో సొ ంత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల మధ్య పంచా యతీ పోరు ఆసక్తికరంగా మారింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో ఒకచోట అన్నపై తమ్ముడు గెలవగా.. మరోచోట చెల్లెలుపై అక్క విజయం సాధించింది. మండలంలోని సుంగాపూర్ పంచాయతీలో అన్న టేకం మారుతి బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీపడగా, తమ్ముడు టేకం సురేశ్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా బరిలో నిలిచాడు. మారుతికి 137 ఓట్లు రాగా, సురేశ్‌కు 159 ఓట్లు వచ్చాయి. దీంతో సొంత అన్నపై తమ్ముడు సురేశ్ 22 ఓట్లతో విజయం సాధించాడు. అలాగే గడలపల్లిలో అక్క ఆత్రం శంకరమ్మ బీఆర్‌ఎస్ మద్దతుతో, చెల్లెలు సిడాం విమల కాంగ్రెస్ మద్దతుతో బరిలో నిలిచారు. శంకరమ్మకు 326 ఓట్లు రాగా, విమల 258 ఓట్లకే పరిమితమైంది. దీంతో అక్క 68 ఓట్లతో విజయం సాధించింది.
అన్నపై తమ్ముడు.. చెల్లైపె అక్క


